ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ' - UPDATES ON HOME LAND PAPERS DISTRIBUTION

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాల పంపిణి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు అన్నారు. గుంటూరు జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు

homelands
'అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాల పంపిణీయే ప్రభుత్వ లక్ష్యం'

By

Published : Feb 4, 2020, 6:55 AM IST

'అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాల పంపిణీయే ప్రభుత్వ లక్ష్యం'

ఉగాదినాటికి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు పంపిణీచేస్తామని గుంటూరు జిల్లా ఇంఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. సమావేశంలో మంత్రులు సుచరిత, వెంకటరమణ, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. జిల్లాలో 2.30 లక్షల మందికి స్థలాలు పంపిణీ చెయ్యనున్నామన్నారు. ప్రభుత్వ భూమి లేని చోట రైతుల నుంచి భూములు సేకరిస్తున్నామని తెలిపారు. సెంటు భూమి లేనివారు ఉండకూడదని అర్హులైన వారికి ఇంటి స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పారు. వీటి పట్టాలను మహిళల పేరుతోనే ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి-'సీమలో కరవు నివారణ కోసం కాల్వలు విస్తరించండి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details