Minister vellampalli srinivas in GGH : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద కృష్ణా నదిలో మునిగి మృతిచెందిన ఐదుగురు వేద విద్యార్థులు, ఉపాధ్యాయుడి మృతదేహాలను.. జీజీహెచ్లో దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటన గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం దురదృష్ణకరమని వ్యాఖ్యానించారు. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని.. చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు వెల్లడించారు.
ఐదుగురు విద్యార్థులు సహా ఒక ఉపాధ్యాయుడు మృతి చెందడం బాధాకరం. ఈ ఘటనలో మృతి చెందినవారి మృతదేహాలను వారి వారి స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. వారి తల్లిదండ్రులు, బంధువులను సంప్రదిస్తున్నాం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. - వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి
సరదాగా ఈతకు వెళ్లి...
students death in guntur : గుంటూరు జిల్లా అచ్చంపేట మండలంలోని మాడిపాడు వద్ద పెనువిషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని శ్వేత శృంగాచలం వేద వేదాంత గురుకుల వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈత రాకపోవడంతో వారంతా నదీ ప్రవాహంలో చిక్కుకుని గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు, గజఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా... ఆరుగురి మృత దేహాలు లభ్యమయ్యాయి.