దేశ చరిత్రలోనే బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర సీఎం జగన్‌కే దక్కిందని మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బీసీలను తెదేపా కేవలం ఓటు బ్యాంకుగా చూసింది తప్ప... వారి అభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని ఆరోపించారు. గుంటూరులో మంత్రి శ్రీరంగనాథరాజు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. బీసీల ఇబ్బందులను పాదయాత్రలో అధ్యయనం చేశాకే... 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించారని సుచరిత అభిప్రాయపడ్డారు. సామాజికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్న బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజుచెప్పారు.
బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర సీఎం జగన్‌దే: మంత్రి సుచరిత - ఏపీలో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు వార్తలు
బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర సీఎం జగన్‌కే దక్కిందని మంత్రులు మేకతోటి సుచరిత్ర, చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. అన్ని రంగాల్లో బీసీలను అభివృద్ది చేయడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
MINISTER
TAGGED:
bc corporations in ap