గుంటూరు సర్వజనాస్పత్రిలో...రోగుల సహాయకులకు కూడా రెండు పూటలా భోజన సదుపాయం కల్పిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. ఉదయం, సాయంత్రం రెండుపూటలా 200 మందికి ఆహారం అందిస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా జరుగుతున్న సేవా కార్యక్రమానికి తనవంతుగా కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛందసంస్థలు, పారిశ్రామికవేత్తలు, దాతలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి చేయూత అందించాలని మంత్రి కోరారు.
'జీజీహెచ్లో రోగుల సహాయకులకు ఉచిత భోజన సదుపాయం' - గుంటూరు జీజీహెచ్ వార్తలు
గుంటూరు జీజీహెచ్లో రోగుల సహాయకులకు రెండు పూటలా ఉచిత భోజన సుదుపాయం కల్పిస్తామని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ సేవా కార్యక్రమానికి తన వంతుగా కోటి రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, దాతలు ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని కోరారు.
Minister sriranganatha raju
మంత్రి శ్రీరంగనాథరాజు...ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు గిరిధర్, ముస్తపా, కలెక్టర్ శామ్యూల్ అనంద్ కుమార్తో కలసి జీజీహెచ్లో పర్యటించారు. మాత, శిశు ఆస్పత్రి నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. వైద్యులు, సిబ్బంది ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నామన్నారు.
ఇదీ చదవండి :ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు ఎందుకు..?: పవన్