గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో రోగుల బంధువుల కోసం నిర్మించిన భోజనశాలను జులై 4న ప్రారంభించనున్నట్లు గృహనిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాధరాజు వెల్లడించారు. ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు 300 మందికి ఆహారం అందించవచ్చని అన్నారు. భోజన సదుపాయాలు లేక రోగుల సహాయకులు పడుతున్న అవస్థలను గమనించి ఈ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
గుంటూరు జీజీహెచ్లో భోజనశాలను పరిశీలించిన మంత్రి శ్రీరంగనాధరాజు - minister sri ranganatharaju
గుంటూరు ప్రభుత్వాసుపత్రిని మంత్రి శ్రీరంగనాథరాజు పరిశీలించారు. రోగుల సహాయకుల కోసం నిర్మించిన భోజనశాలను సందర్శించారు.
![గుంటూరు జీజీహెచ్లో భోజనశాలను పరిశీలించిన మంత్రి శ్రీరంగనాధరాజు minister sri ranganatharaju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12251773-647-12251773-1624551330795.jpg)
మంత్రి శ్రీరంగనాథరాజు