ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికలకు వైకాపా ఎప్పుడూ ముందే: మంత్రి రంగనాథరాజు - మంత్రి రంగనాథరాజు తాజా వార్తలు

ఎన్నికలంటే వైకాపా ఎప్పుడూ ముందే ఉంటుందని... కరోనా కారణంగానే ఎన్నికలు వద్దంటున్నామని రాష్ట్ర మంత్రి శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. 90 శాతం మంది ప్రజలు వైకాపా వెంటే ఉన్నారన్నారు. కరోనా సమయంలోనూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్న మంత్రి... ప్రతి కుటుంబానికి సుమారు రూ.90 వేల వరకు లబ్ధి జరిగిందన్నారు.

Minister ranganath raju
Minister ranganath raju

By

Published : Nov 18, 2020, 11:20 PM IST

ఎన్నికలకు వైకాపా ఎప్పుడూ ముందే : మంత్రి రంగనాథరాజు

ఎన్నికలంటే వెనుకడుగు లేదని, ముందే ఉంటామని.. కరోనా వైరస్ కారణంగానే ప్రస్తుతానికి ఎన్నికలు వద్దంటున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. గుంటూరు కలెక్టరేట్​లో నిర్వహించిన వ్యవసాయ సలహా మండలి సమావేశానికి హోంమంత్రి సుచరితతోపాటు హాజరైన మంత్రి శ్రీరంగనాథరాజు...90 శాతం మంది ప్రజలు వైకాపా వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు.

8 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్న మంత్రి... ప్రతి కుటుంబానికి రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు లబ్ధి జరిగిందని చెప్పారు. కరోనా సమయంలో ప్రపంచంలో ఎక్కడా ఇన్ని పథకాలు అమలుకాలేదని చెప్పారు. డిసెంబరు 25న పేదలకు పూర్తిస్థాయిలో ఇళ్ల స్థల పట్టాలు అందిస్తామని.. ప్రభుత్వం ఇళ్ల పథకానికి రూ.1400 కోట్లు కేటాయించగా.. తాజాగా రూ.500 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details