గుంటూరులో స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఉత్సవాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్ని నాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం పోలీసులు మంత్రి నానికి గౌరవ వందనం సమర్పించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు మెమెంటోలు అందజేశారు.
గుంటూరు సమగ్ర అభివృద్ధికి చర్యలు: మంత్రి పేర్ని
గుంటూరులో స్వాతంత్య్ర వేడుకలకు పోలీస్ పరేడ్ మైదానం వేదికైంది. మంత్రి పేర్ని నాని హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర ఉత్సవాలు