Kottu Satyanarayana: 'ఆలయాలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం' - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
Kottu Satyanarayana: దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి అంతం పలకాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. భక్తులు కానుకలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ
Kottu Satyanarayana: దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి అంతం పలకాలని.. ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులకు సూచించారు. తాడేపల్లి సీతానగరంలో దేవదాయ ధర్మాదాయ శాఖ పరిపాలన భవనంలో అధికారులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా మంత్రి ప్రసంగించారు. ఆలయాలకు భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆక్షేపించారు.
ఇదీ చదవండి: CM Jagan on nellore leaders disputes: నెల్లూరు జిల్లా వైకాపా నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం