గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో ఇటీవల సమీక్ష నిర్వహించిన మంత్రి.. గుంటూరులోని ఆయన నివాసంలో ఆ పనులపై చర్చించారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో మంజూరైన పనుల పురోగతిపై సమీక్షిస్తూ.. గ్రావెల్, సిమెంట్ రోడ్ల నిర్మాణాలతో పాటు గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాల పనులు మార్చి ఆఖరుకు ఖచ్చితంగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికీ మొదలుకాని పనులను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. పూర్తైన పనులకు ఎం.బుక్ రాయడం, బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. ప్రతి వారం ఈ పనులపై సమీక్ష జరుపుతానని.. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని స్పష్టం చేశారు. పీఆర్ ఈఈ రమేష్ బాబు, డీఈ రత్నబాబుతో పాటు ఐదు మండలాల ఏఈలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.