కరోనా లాక్‌డౌన్ కారణంగా గుంటూరులో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల కార్మికులు తమను స్వస్థలాలకు పంపించాలని రోడ్డెక్కారు. కొరిటెపాడు కూడలి వద్ద తమ ఆధార్ కార్డులు చూపిస్తూ ఆందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల కూలీలను తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దృష్ట్యా తమను కూడా పంపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే గుంటూరు రెడ్జోన్లో ఉన్న దృష్ట్యా వీరిని తరలించడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. తాము 40 రోజులుగా ఇక్కడ ఇబ్బందులు పడుతున్నామని.. తమను తరలించేందుకు చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. వలస కూలీల వేదన వారి మాటల్లోనే..!
'నీళ్లు తాగి బతుకుతున్నాం.. మమ్మల్ని పంపేయండి' - migrnat labour news in guntur
లాక్డౌన్తో చేసేందుకు పని లేదు.. తినడానికి తిండి లేదు.. మమ్మల్ని సొంతూరుకు పంపించాలని వలస కార్మికులు గుంటూరులో రోడ్డెక్కారు. స్వస్థలాల్లో తమ కుటుంబాలకు సరైన ఆసరా లేక నరకయాతనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను స్వస్థలాలకు తరలించాలని ప్రభుత్వం, అధికారులను వేడుకుంటున్నారు.
'నీళ్లు తాగి బతుకుతున్నాం.. మమ్మల్ని పంపేయండి'