'ఒక్క పూట అన్నం కోసం ఎదురుచూడటం అంటూ.....ఆ మధ్య వచ్చిన ఓ సినిమా పాట ఇప్పుడు లాక్‌డౌన్ చట్రంలో చిక్కుకున్న రోజువారీ కూలీల కష్టాలకు అద్దంపడుతోంది. గుంటూరు శివార్లలోని సుశాంక గోయల్, కృష్ణబాబు, గంగిరెద్దుల కాలనీల్లో.. ఎక్కువగా కూలిచేసుకునే పేదలే నివసిస్తుంటారు. వీరికి సాధారణ రోజుల్లోనే ఒక్కోసారి ఉపాధి దొరకదు. లాక్‌డౌన్ కారణంగా పూర్తిగా పనుల్లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆదాయంలేక ఆహారం, నిత్యావసరాలిచ్చే దాతల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి