గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామంలో.. ఒక గోదాములో అక్రమంగా నిలువ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు మంగళవారం అర్ధరాత్రి పట్టుకున్నారు. అక్రమంగా.. లారీలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారని జిల్లా విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టారు.
PDS Rice Seized : అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు.. 200 క్వింటాళ్లు సీజ్.. - Seizure of PDS rice in Guntur district
అధికారుల కళ్లుగప్పి అర్ధరాత్రి సమయంలో రేషన్ బియ్యాన్ని తరలించాలనుకున్న నిందితుల గుట్టు రట్టయింది. సమాచారం అందుకున్న తహసీల్దార్.. రేషన్ బియ్యాన్ని తరలించడానికి వచ్చిన వాహనాన్ని సీజ్ చేసి, ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

అర్థరాత్రి రేషన్ బియ్యం తరలింపు..200 క్వింటాళ్లు సీజ్..
బియ్యాన్ని తరలిస్తున్న వాహనంతోపాటు 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీనిపై జాయింట్ కలెక్టర్ కు నివేదిక సమర్పించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. తండ్రీ కుమార్తె మృతి