వైకాపా రెండేళ్ల పాలన విధ్వంసం అంటూ.. తెదేపా నేతలు పుస్తకాలు విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందని హోమంత్రి(Home minister) మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. విద్యా, వైద్య, సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. కరోనా వంటి సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
తెదేపా నేతలు విమర్శలు చేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని.. తమ ఉనికిని కాపాడుకోవడానికి వారు ఇష్టానుసారంగా మాట్లాడం సరికాదన్నారు. గడచిన రెండేళ్లలో క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిందన్నారు. విశాఖలో ఫార్మా యువతి వివాదంలో పోలీసులు వారి డ్యూటీ నిర్వర్తించారని.. సోషల్ మీడియాలో వస్తున్న వాటిని చూసి పోలీసులను నిందించడం తగదన్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నందునే స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించారని.. దానిని రాజకీయం చేయాలనుకోవడం సరికాదన్నారు.