MRO: గుంటూరు జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడికొండూరు తహసీల్దార్‌పై విచారణ చేపట్టారు. పులిచింతల ప్రొజెక్టు స్పెషల్ కలెక్టర్ వినాయకం విచారణ జరిపారు. తహసీల్దార్ కరుణకుమార్, కంప్యూటర్ ఆపరేటర్ అవినీతికి పాల్పడుతున్నారని మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కార్యాయంలో ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఇందులో మొత్తం 11మంది మధ్యవర్తులుగా వ్యవరిస్తున్నారని తెలిపారు. పొలం కొలతలు తీయడానికి ఒక్కో ఎకరానికి రూ.50 వేలు డిమాండ్ చేస్తున్నారని, వారిలో సర్వేయర్, మరి కొంత మంది ఉన్నారని చెప్పారు. ఫిర్యాదు చేసిన వారు శ్యామ్యూల్, శంకర్రావు, అప్పారావు అను ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.