ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్తపేటలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి చర్యలు: ఎస్పీ

కొత్తపేటలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఆసుపత్రుల యాజమాన్యాలతో అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సమావేశమయ్యారు. ఆసుపత్రి బయట ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు ఒక కమిటీని ఏర్పాటు చేసి... సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

By

Published : Apr 3, 2021, 10:46 PM IST

ఎస్పీ అమ్మిరెడ్డి
ఎస్పీ అమ్మిరెడ్డి

కొత్తపేటలో ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించినట్లు.. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. గుంటూరు కొత్తపేటలోని పచ్చిపులుసు కల్యాణమండపంలో డాక్టర్లతో అర్బన్ ఎస్పీ సమావేశం అయ్యారు. ట్రాఫిక్​పై అవగాహన కల్పించారు. కొత్తపేటలో ఆసుపత్రులు ఎక్కువగా ఉండటం వలన.. వచ్చే రోగులు, వారి బంధువులు రోడ్లపై సరైన పద్ధతిలో పార్కింగ్ చేయడం లేదని ఎస్పీ వారికి వివరించారు. ఈ కారణంగా రహదారిపై తరుచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు.

ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి.. ఆసుపత్రి బయట ఒక సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాలను ఆసుపత్రి ఎదుట విచ్చలవిడిగా వదిలి వెళ్లకుండా.. పార్కింగ్ ప్రదేశాల్లో, సెల్లార్​లో నిలిపేలా చూడాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణకు ఒక కమిటీని ఏర్పాటు చేసి.. సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండీ... బైపోల్: గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతున్న పార్టీలు

ABOUT THE AUTHOR

...view details