ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముస్లిం సంఘాలతో మేయర్, నగర ఎమ్మెల్యేలు భేటీ

గుంటూరు నగరంలో ఈనెల 25నుంచి రాత్రి కర్ఫ్యూకు అధికారులు సిద్ధమవుతున్నారు. కేసుల తీవ్రత దృష్ట్యా రాత్రి కర్ఫ్యూ విధించామని.. అందరూ సహకరించాలని వారికి విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసం కావటంతో ముస్లిం సంఘాలతో మేయర్, నగర ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. మసీదుల వద్ద కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవటంతో పాటు ఎక్కువమంది గుమిగూడకుండా చూడాలని సూచించారు.

Mayor and city MLAs meet with Muslim
Mayor and city MLAs meet with Muslim

By

Published : Apr 21, 2021, 7:58 PM IST

గుంటూరు నగరంలో ఈనెల 25నుంచి రాత్రి కర్ఫ్యూకు యంత్రాంగం సిద్ధమవుతోంది. కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావటంతో ముస్లిం సంఘాలతో మేయర్, నగర ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. కేసుల తీవ్రత దృష్ట్యా రాత్రి కర్ఫ్యూ విధించామని.. అందరూ సహకరించాలని వారికి విజ్ఞప్తి చేశారు. మసీదుల వద్ద కరోనా నియంత్రణ చర్యలు తీసుకోవటంతో పాటు ఎక్కువమంది గుమిగూడకుండా చూడాలని సూచించారు. ముస్లిం సంఘాలు తమ విజ్ఞప్తికి సానూకూలంగా స్పందించాయని మేయర్ కావటి మనోహరనాయుడు, ఎమ్మెల్యే ముస్తఫా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details