ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ ఆత్రుత ప్రాజెక్టు పూర్తి చేయడంలో చూపండి' - Mastan vali latest news

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరిన సీపీఐ, అమరావతి ఐకాస నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టాభిపురం ఠాణాలో ఉన్న వారిని కాంగ్రెస్ నేత మస్తాన్​వలీ పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.

Mastan vali serious comments on ycp over polavaram project
'ఆ ఆత్రుత ప్రాజెక్టు పూర్తి చేయడంలో చూపండి'

By

Published : Nov 22, 2020, 2:54 PM IST

పోలవరం ప్రాజెక్టు వద్ద విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఉన్న ఆత్రుత... ప్రాజెక్టును పూర్తి చేయడానికి లేదని ఏపీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి.. పోలీసులు అడ్డుకోవడంతో పట్టాభిపురం పోలీస్​స్టేషన్​లో ఉన్న సీపీఐ నేతలను, అమరావతి ఐకాస నేతలను ఆయన పరామర్శించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లకుండా సీపీఐ నేతలను అడ్డుకునే హక్కు ఎవరు ఇచ్చారని మస్తాన్ వలి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవానాడీ అని వివరించారు. పోలవరం ప్రాజెక్టును త్వరతిగతిన పూర్తి చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details