గుంటూరు కలెక్టరేట్ పాలనాధికారి మల్లికార్జున రావు తన ఛాంబర్లో ఉన్న సిబ్బందికి మాస్కులు, శానిటైజర్ బాటిళ్లును అందజేశారు. జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యాలయ భవనాన్ని హైపో సోడియం క్లోరైడ్ ద్రావణంతో పిచికారి చేయించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని... కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ - గుంటూరు కలెక్టర్ శ్యామ్యూల్ తాజా వార్తలు
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గుంటూరు కలెక్టరేట్ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. కలెక్టరేట్ కార్యాలయాన్ని హైపో సోడియం క్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేయించారు. కొవిడ్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

లెక్టరేట్లో ఉన్న సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ