ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Marathon: ఆజాదీకా అమృత్ మహోత్సవం.. గుంటూరులో 10కె మారథాన్​ - గుంటూరులో మారథాన్​ నిర్వహించిన ఎస్‌వీఆర్‌ఎం ఎయిడెడ్ కళాశాల

Marathon: ఎస్‌వీఆర్‌ఎం ఎయిడెడ్ కళాశాల ఆధ్వర్యంలో గుంటూరులో 10 కె మారథాన్ నిర్వహించారు. నడక, వ్యాయామంపై అవగాహన పెంచుకోవాలని జాతీయ మారథానిస్ట్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు సూచించారు.

Marathon in guntur
గుంటూరులో 10కె.మారథాన్​

By

Published : Mar 6, 2022, 12:28 PM IST

Marathon: ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా... గుంటూరులో ఎస్వీఆర్​ఎం ఎయిడెడ్ కళాశాల ఆధ్వర్యంలో 10 కె మారథాన్ నిర్వహించారు. సజ్జావారిపాలెం కూడలి నుంచి శ్రీ వెలగపూడి రామకృష్ణ కళాశాల వరకు మారథాన్ కొనసాగింది. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు జాతీయ మారథానిస్ట్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

నడక, వ్యాయామం వల్ల ఉపయోగాలు ప్రతి ఒక్కరికీ తెలియజేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామాల్లోని విద్యార్థులకు అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

గుంటూరులో 10కె.మారథాన్​

ABOUT THE AUTHOR

...view details