గత రెండు రోజులుగా ఏలూరులో అంతుపట్టని వింత వ్యాధితో ప్రజలు ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ ఘటనపై భాజపా ఎంపీ జీవిఎల్ నరసింహారావు స్పందించారు. దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియాను ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడించారు. గులేరియా సూచన మేరకు ఎనిమిది మందితో కూడిన ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం ఏలూరుకు వెళ్లింది. మంగళగిరి నుంచి ఏలూరుకు వెళ్లిన నిపుణులు... బాధితులను పరీక్షించి, స్థానిక వైద్యులతో చర్చించారు. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
ఏలూరుకు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం - eluru news updates
ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వ్యాధికి గల కారణాలపై అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ దృష్టి సారించింది. వ్యాధి నిర్ధారణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ వైద్యుల బృందం ఏలూరుకు వెళ్లింది. వీరు రోగుల నుంచి రక్త నమూనాలు సేకరించి కారణాలు అన్వేషించనున్నారు.
![ఏలూరుకు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం mangalagiri aiims doctors team went to eluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9788451-954-9788451-1607279464559.jpg)
ఏలూరుకు మంగళగిరి ఎయిమ్స్ వైద్యుల బృందం