ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Man suicide attempt మద్యం తాగొద్దన్నందుకు పురుగు మందు తాగాడు - గుంటూరు వార్తలు

suicide attempt మద్యం మానేయ్యమన్నందుకు ఓ వ్యక్తి తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. కొడుకు మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నడింపల్లిలో చోటుచేసుకుంది.

Man suicide attempt
Man suicide attempt

By

Published : Feb 7, 2022, 10:35 AM IST

Man suicide మద్యం తాగొద్దని వారించినందుకు పురుగు మందు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. చెరుకుపల్లి ఏఎస్సై షరీఫ్‌ కథనం ప్రకారం.. నడింపల్లి కాలనీకి చెందిన దాసరి బాబూరావు(48) కూలి పనులకు వెళ్తూ మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 1న తాగి ఇంటికి వచ్చిన ఆయన కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. తాగి రావడం ఎందుకని కుమారుడు మురళి అనడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. సాయంత్ర వేళ ఇంటి వద్ద వాంతులు చేసుకుంటూ బాబూరావు కనిపించడంతో కుటుంబ సభ్యులు వెంటనే గుంటూరులోని జీజీహెచ్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. తనను తిట్టినందుకు మనస్తాపంగా మల్లెతోట చీడపీడల నివారణకు వాడే పురుగు మందు తాగినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు. బాబూరావు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details