ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలీసుల దెబ్బలు తాళలేక భవనంపై నుంచి దూకా' - men beaten by sattenapally police

పోలీస్ స్టేషన్ భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

committed
committed

By

Published : Jan 27, 2022, 7:06 PM IST

గుంటూరు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఓ చోరీ కేసులో అనుమానంతో చల్లా సుబ్బారావు అనే యువకుడిని గ్రామీణ పోలీసులు బుధవారం స్టేషన్​కు తీసుకువచ్చారు. విచారణ పేరుతో పోలీసులు చావబాదారని.. దెబ్బలు తట్టుకోలేక భవనంపైనుంచి దూకానని బాధితుడు వాపోయాడు. పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాని చెప్పినప్పటికీ వినలేదని.. తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపించాడు. తీవ్ర గాయాలైన సుబ్బారావును పోలీసులు మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని వైద్యశాలకు తరలించారు.

'పోలీసుల దెబ్బలు తాళలేక భవనంపై నుంచి దూకా'

ABOUT THE AUTHOR

...view details