స్థానికసంస్థల ఎన్నికలను అడ్డుపెట్టుకొని ప్రజాప్రతినిధుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడేందుకు యత్నించిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. వైఎస్ భారతి ఆదేశాల మేరకు డాక్టర్ వైస్సార్ ట్రస్టు పేరుతో.. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5లక్షల నగదు, వైకాపా తరఫున పోటీ చేసే అభ్యర్థులకు రూ.6 లక్షలు ఇవ్వబోతున్నట్టు సామాజిక మధ్యమాల్లో పోస్టులు దర్శనమిచ్చాయి.
సామాజిక మాధ్యమంలో తప్పుడు పోస్టులు.. వ్యక్తి అరెస్ట్
సామాజిక మాధ్యమంలో తప్పుడు పోస్టులు పెట్టారనే ఆరోపణలతో.. విజయనగరం జిల్లా గాదెలవలసకు చెందిన ఓ వ్యక్తిని.. పోలీసులు అరెస్ట్ చేశారు. వైకాపా మద్దతుతో నామినేషన్లు వేసే అభ్యర్థులకు రూ.6 లక్షలు ఇస్తామని పోస్టు పెట్టడంతో.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ తతంగమంతా గుంటూరులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నడిపించినట్లు గుంటూరు పోలీసులు గుర్తించారు.
విజయనగరం జిల్లాకు చెందిన వేణుగోపాలనాయుడు అనే వ్యక్తి.. పోస్టింగ్స్‌ను ఎమ్మెల్యేల ఫేస్‌బుక్ అకౌంట్లకు పంపాడు. ముందుగా తన అకౌంట్‌కు రూ.5 వేలు జమ చేయాలని కోరాడు. ఇది మోసమని గుర్తించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు.. విజయనగరం జిల్లా సీతానగరం మండలం గాదెలవలసకు చెందిన రాజాన పోలినాయుడిగా గుర్తించి అతడిని అరెస్టు చేశారు. వేణుగోపాలనాయుడు గుంటూరు జిల్లా తెనాలిలోని ఇంటిని అద్దెకు తీసుకొని ఈ తతంగం నడిపినట్లు గుర్తించారు.
ఇదీ చదవండి:ఎస్‌ఈసీ లేఖలోని అంశాలపై చర్య తీసుకోండి.. స్పీకర్‌కు మంత్రుల ఫిర్యాదు