గుంటూరు మిర్చి యార్డు నూతన కార్యదర్శిగా ఎం.వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో రొంపిచెర్ల మార్కెట్ యార్డు కార్యదర్శిగా పని చేశారు. అనంతరం మార్కెటింగ్ శాఖ ఉపసంచాలకులుగా పదోన్నతి పొందారు. దీంతో వెంకటేశ్వర రెడ్డికి పూర్తి స్థాయి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. మిర్చియార్డుకు ప్రస్తుతం వేసవి సెలవులు నడుస్తున్నాయి. రైతులు ఇబ్బందులు పడకుండా గోదాముల్లో లావాదేవీలకు అవకాశం కల్పించినట్లు నూతన కార్యదర్శి తెలిపారు.
గుంటూరు మిర్చియార్డు నూతన కార్యదర్శిగా వెంటేశ్వరరెడ్డి నియామకం - Guntur distict news
గుంటూరు మిర్చియార్డు నూతనకార్యదర్శిగా ఎం.వెంటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. గతంలో ఆయన రొంపిచెర్ల మార్కెట్ యార్డు కార్యదర్శిగా పనిచేశారు.
ఎం. వెంకటేశ్వరరెడ్డి