ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంబేడ్కర్‌నే స్ఫూర్తిగా యువత తీసుకోవాలి: సీఎస్‌ - అంబేడ్కర్ జయంతి

అంబేడ్కర్‌ను నేటి యువత స్ఫూర్తి గా తీసుకోవాలి. స్వాతంత్య్రానంతరం దేశంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబాసాహెబ్. సమసమాజ స్థాపన కోసం పాటుపడిన వ్యక్తి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్- ఎల్వీ సుబ్రమణ్యం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.

గుంటురులో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.

By

Published : Apr 14, 2019, 12:46 PM IST

అంబేడ్కర్‌నే స్పూర్తిగా తీసుకుని యువత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం సూచించారు. అస్పృశ్యతకు వ్యతిరేకంగా... సమసమాజం కోసం బాబాసాహెబ్ జీవితాంతం పోరాడారని గుర్తు చేశారు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్... నిమ్నవర్గాలే కాకుండా అన్నివర్గాలకు ఆదర్శనీయుడని చెప్పారు. గుంటూరులోని లాడ్జ్‌సెంటర్‌లో అంబేడ్కర్ 128వ జయంతి ఉత్సవాలకు హాజరైన ఎల్వీ సుబ్రమణ్యం.... పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోన శశిధర్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారి రావత్, పోలా భాస్కర్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీకేశ్ లత్కర్ పాల్గొన్నారు.

గుంటురులో అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details