Lorry Burnt: గుంటూరు జిల్లా నరసరావుపేట - చిలకలూరిపేట ప్రధాన రహదారిపై బాసికాపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున లారీ దగ్ధమైంది. చిలకలూరిపేట మండలం తాతపూడి నుండి ప్రభల సామాగ్రితో నరసరావుపేటకు వస్తున్న లారీ బాసికాపురం వద్దకు చేరుకున్న సమయానికి లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు నరసరావుపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది..మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.