ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తాళ్లాయపాలెం పుష్కర్​ ఘాట్​ వద్ద శివుడి విగ్రహం ధ్వంసం - గుంటూరు తాళ్లాయపాలెంలో శివుని విగ్రహం ధ్వంసం

గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం పుష్కర్ ఘాట్​ వద్ద ఉన్న శివుడి విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివానందస్వామి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.

తాళ్లాయపాలెం పుష్కర్​ ఘాట్​ వద్ద శివుడి విగ్రహం ధ్వంసం
తాళ్లాయపాలెం పుష్కర్​ ఘాట్​ వద్ద శివుడి విగ్రహం ధ్వంసం

By

Published : Jun 30, 2020, 1:33 PM IST

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న శివుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన శివుని విగ్రహాన్ని తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివానందస్వామి సందర్శించారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. శివుడి విగ్రహం ధ్వంసం చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని మంత్రి స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details