ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్వవస్థను రాష్ట్రపతే మెచ్చుకున్నారు: లోకేశ్ - అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు: ట్విట్టర్లో లోకేశ్​

ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్వవస్థను రాష్ట్రపతే స్వయంగా మెచ్చుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గుర్తు చేశారు. వైకాపా నేతలవి అసత్య ఆరోపణలని కొట్టిపారేశారు.

ట్విట్టర్లో లోకేశ్​

By

Published : Jul 30, 2019, 3:56 PM IST


ఐదువేల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన ఏపీ ఫైబర్​ గ్రిడ్​ వ్యవస్థను రూ. 350 కోట్లతోనే పూర్తి చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదని నారా లోకేశ్​ అన్నారు. తాము సాధించిన ఫలితాలను భారత రాష్ట్రపతితో సహా పలు రాష్ట్రాల సీఎంలు అభినందించారని ట్వీట్​ చేశారు. తమ పార్టీ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్న వైకాపాపై ప్రజలకు రోత పుడుతుందని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నా.. ఈ అసత్య ప్రచారాలెందుకని దుయ్యబట్టారు. రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరంటూ.. ఘాటుగా స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details