Liquid cannabis seized: రూ.3.35 లక్షలు విలువ చేసే ద్రవరూప గంజాయి పట్టివేత - Liquid cannabis seized news in guntur district
గుంటూరులో ద్రవరూప గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3.35 లక్షలు విలువ చేసే 900 గ్రాముల ద్రవరూప గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ద్రవరూప గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను గుంటూరులో ఎస్ఈబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.3,35,000 విలువ చేసే 900 గ్రాముల ద్రవరూప గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమరావతి రోడ్డులోని ఓ హాస్పిటల్ ఎదురుగా ముగ్గురు అనుమానితులను పట్టుకుని ప్రశ్నించగా.. వారి వద్ద లిక్విడ్ గంజాయి ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితులు ధోవరి జ్యోతిరత్న ప్రదీప్, సురేంద్ర సింగ్ ,అన్నపురెడ్డి సాయి మహేష్ కుమార్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి