ఉల్లితో పాటు పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో వామపక్షాలు ఆందోళన నిర్వహించాయి. శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టాయి. రహదారిపై కుస్తీ పోటీలు పెట్టి.. గెలిచిన వారికి ఉల్లిపాయల ట్రోఫీని బహుమతిగా అందజేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఉల్లికి తీవ్రకొరత ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. పేదలపై పెనుభారంగా మారిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
రహదారిపై కుస్తీ పోటీ.. గెలిచిన వారికి ఉల్లి ట్రోఫీ - గుంటూరులో వామపక్షాల ధర్నా
పెరిగిన ఉల్లి ధరలపై వామపక్షాలు గుంటూరులో వినూత్న నిరసన చేపట్టాయి. రహదారిపై కుస్తీ పోటీలు పెట్టి గెలిచిన వారికి ఉల్లి ట్రోఫీని బహుమతిగా అందించాయి.
![రహదారిపై కుస్తీ పోటీ.. గెలిచిన వారికి ఉల్లి ట్రోఫీ left parties dharnaa on onions high rates in guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5339679-277-5339679-1576060728714.jpg)
గుంటూరులో వామపక్షాల ధర్నా