ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీబీఐ అధికారులపై మహిళా ఎస్సై గూఢచర్యం! - guntur lady si crime news

గుంటూరులో ఓ మహిళా ఎస్సై వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఏకంగా సీబీఐ అధికారులపైనే నిఘా పెట్టింది. అధికారుల భధ్రత కోసం పంపిస్తే వారిపైనే గూఢచర్యానికి పాల్పడింది.

lady si tries to cheat cbi officials in guntur
lady si tries to cheat cbi officials in guntur

By

Published : Aug 26, 2020, 10:47 PM IST

ఆమె గుంటూరు నగరంలోని ఓ పోలీస్ స్టేషన్​లో ఎస్సైగా పనిచేస్తున్నారు. కానీ ఆమె ఏకంగా సీబీఐ అధికారులపైనే నిఘా పెట్టింది. విషయం గ్రహించి విస్తుపోవటం సీబీఐ అధికారుల వంతైంది.

ఇలా చిక్కింది

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముగ్గురిని పోలీసులు అక్రమంగా నిర్భందించారనే కేసులో సీబీఐ విచారణ నడుస్తోంది. క్షేత్రస్థాయి విచారణ కోసం సీబీఐ అధికారులు రెండు రోజులుగా గుంటూరులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వారికి భద్రత కోసం అరండల్ పేట స్టేషన్​లో పనిచేస్తున్న మహిళా ఎస్సైని కేటాయించారు. సీబీఐ అధికారుల వెంట వెళ్లిన ఆమె... విచారణ తంతుని రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీయసాగింది. అలాగే వాటిని వేరే వాళ్లకు పంపించింది. ఆ విషయాన్ని సీబీఐ అధికారులు పసిగట్టారు. ఆమె ఫోన్ తీసుకుని పరిశీలించారు. వెంటనే అక్కడి నుంచి ఆమెను పంపించి వేశారు. తమపైనే గూఢచర్యానికి పాల్పడిన ఎస్సైపై జిల్లా ఎస్పీ, గుంటూరు రేంజ్ ఐజీకి సమాచారం ఇచ్చారు. అలాగే సీబీఐ తరఫున కూడా ఆమెపై చర్యలు తీసుకునే విషయం పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి

సినీ ఫక్కీలో దోపిడీ..సెల్​ఫోన్ల లోడు లారీ అపహరణ

ABOUT THE AUTHOR

...view details