అడగందే అమ్మయినా అన్నం పెట్టదని అంటారు... కానీ అడక్కుండానే అన్నార్తుల ఆకలి తీరుస్తుంది ఆ మాతృమూర్తి. ఆ మహిళ పేరు వేముల భారతి. ఆమె గుంటూరు స్వర్ణభారతి నగర్లో నివాసం ఉంటున్నారు. కరోనా మహమ్మారి కారణంగా అనేక మంది ప్రజలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి తనకు ఉన్నంతలో ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. అస్మిత మహిళా మండలి అనే పేరుతో ఆమె అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ... దాతలు ముందుకు వచ్చి తోచినంత సాయం చేస్తున్నారు. ఆ విధంగా గత 5 నెలలుగా ప్రతిరోజూ 300 మందికి అన్నదానం చేస్తున్నారని భారతి తెలిపారు.
అన్నార్తులకు ఆపన్నహస్తం అందిస్తున్న మాతృమూర్తి - గుంటూరు నగరం తాజా వార్తలు
ఆకలి అన్నవారికి కడుపారా అన్నం పెడుతుంది ఆ మహిళా. అలా రోజుకు 300 మందికి అన్నదానం చేసి ఉపాధి కోల్పోయిన వారి పాలిట దేవతగా మారింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అనేకం. ఆవిడే గుంటూరుకు చెందిన వేముల భారతి.
నిత్యం 200 మందికి అన్నదానం చేస్తున్న వేముల భారతి