పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయని... సామాజిక వ్యాప్తి దిశగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించటం విద్యార్థులకు ప్రమాదమన్నారు.
పదో తరగతి పరీక్షలు రద్దు చేయండి : కన్నా లక్ష్మీనారాయణ - పదో తరగతి పరీక్షలు రద్దు
పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉండడంతో విద్యార్థులను ఒకచోట చేర్చడం సరైన ఆలోచన కాదన్నారు.
కన్నా లక్ష్మినారాయణ
పరీక్షల పేరుతో ఎక్కువమందిని ఓ చోటకు చేర్చటం సరైన ఆలోచన కాదని కన్నా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం గుర్తించాలన్నారు. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను తర్వాత తరగతికి అప్గ్రేడ్ చేయాలని లేఖలో కోరారు.
ఇదీ చదవండి :పదోతరగతి పరీక్షలు రద్దు చేయాలి: పవన్ కల్యాణ్