ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పాత్రికేయులకు రూ. 10 లక్షల బీమా కల్పించండి: కన్నా - కన్నా లేటెస్ట్ న్యూస్

సీఎం జగన్​కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ 2 లేఖలు రాశారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవాలని కన్నా కోరారు. మరో లేఖలో... వార్తల సేకరణలో పాత్రికేయులు సైతం కరోనా బారిన పడుతున్నారని గుర్తు చేశారు. హరియాణా మాదిరి జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా కల్పించాలని కన్నా కోరారు.

kanna letters to cm jagan
కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Apr 26, 2020, 3:29 PM IST

సీఎం జగన్​కు కన్నా లేఖలు

సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండు లేఖలు రాశారు. లాక్‌డౌన్‌తో తయారీ, సేవారంగం, వ్యాపార సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎక్కువగా నష్టపోయాయని చెప్పారు. చిరు వ్యాపారస్తులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారన్న కన్నా.. దయనీయ స్థితిలో ఉన్నవారిని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. సాధారణ స్థితి వచ్చేవరకు విద్యుత్ బిల్లులను వాయిదా వేయాలని కోరారు. చిరు వ్యాపారస్తులకు 3 నెలలపాటు బిల్లులు మినహాయింపు ఇవ్వాలన్నారు. అప్పుడే వాళ్లు ఆర్థిక సమస్యల నుంచి కోలుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

జర్నలిస్టులకు బీమా కోరుతూ...

కరోనా వేళ పాత్రికేయులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సీఎం జగన్ కు రాసిన రెండో లేఖలో కన్నా ఆవేదన చెందారు. కరోనా దృష్ట్యా విలేకరులకు హరియాణా ప్రభుత్వం రూ.10 లక్షలు బీమా కల్పించిందని గుర్తుచేశారు. ఏపీలోనూ కొందరు జర్నలిస్టులు వార్తాసేకరణలో కరోనా బారిన పడే ప్రమాదం ఉందని చెప్పారు. పాత్రికేయులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులకు రూ.10 లక్షల బీమా కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి:

సీఎంకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్.. ఎందుకంటే?

ABOUT THE AUTHOR

...view details