ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈసీ తొలగింపుపై గవర్నర్​కు కన్నా లేఖ - గవర్నర్​కు కన్నా లేఖ

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్​ను తొలగించడం అప్రజాస్వామిక చర్యని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయటాన్ని తట్టుకోలేకే రమేష్ కుమార్​ను తొలగించారని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర గవర్నర్​కు లేఖలు రాశారు.

kanna letter to governor on SEC
ఎస్​ఈసీ తొలగింపుపై గవర్నర్​కు కన్నా లేఖ

By

Published : Apr 11, 2020, 5:49 AM IST

ఎస్​ఈసీ తొలగింపుపై గవర్నర్​కు కన్నా లేఖ

ఆర్డినెన్స్​ ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను తొలగించటం అత్యంత అప్రజాస్వామిక చర్యని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర గవర్నర్​కు లేఖలు రాశారు. ఎన్నికల కమిషనర్​ని తొలగించే అంశం రాష్ట్ర పరిధిలో లేదని ఆర్టికల్ 243(కె) చెబుతుందన్నారు. కరోనాతో చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని... రాష్ట్రంలోనూ అదే తరహాలో నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే ఎన్నికల వాయిదా వేయటాన్ని తట్టుకోలేకే ఎస్​ఈసీ రమేష్ కుమార్​ని తొలగించారని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నియంతృత్వ ధోరణికి ఈ నిర్ణయం పరాకాష్ఠగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్​ను తిరస్కరించాలని గవర్నర్​ను విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details