చట్టాలు అందరికీ సమానమేనని... కులమతాలకు అతీతంగా అవి అమలు జరగాల్సిన అవసరముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. చట్టం చేయడం గొప్ప కాదని... వాటిని అమలుచేయడమే గొప్పని కన్నా అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో దిశ చట్టం ఆమోదించిన రోజే ... గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన చోటుచేసుకోవడం విచారకరమన్నారు. గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిని శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
'చట్టాలు చేశారు...మరి అమలెప్పుడు...?' - bjp on disha act
అసెంబ్లీలో దిశ చట్టం ఆమోదించిన రోజే గుంటూరులో ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన చోటుచేసుకోవడం విచారకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలు చేయటం గొప్ప కాదని... వెంటనే అమలు పరిచినప్పుడే వాటికి విలువ ఉంటుందన్నారు.

'చట్టాలు చేశారు...మరి అమలెప్పుడు...?'