కరోనాపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న కన్నా... రాష్ట్రంలో ఎన్ని టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. క్వారంటైన్, ఐసొలేషన్ కేంద్రాల సమాచారం ఇవ్వాలన్నారు. మర్కజ్ వెళ్లివచ్చిన వారి గుర్తింపు, ఇతర వివరాలు వెల్లడించాలని కన్నా కోరారు.
కరోనా వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కన్నా - కరోనాపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ డిమాండ్ న్యూస్
ప్రభుత్వ వైఖరిపై ప్రజలకు అనుమానాలు వస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

కరోనా వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కన్నా
Last Updated : Apr 17, 2020, 3:01 PM IST