గుంటూరులో జరిగిన భాజపా ఆవిర్భావ దినోత్సవంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలంతా ఇవాళ ఉపవాసంలో పాల్గొంటున్నారని చెప్పారు. తనపై విమర్శలు చేస్తున్న వైకాపా నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి ప్రజలకు పంచుతూ వైకాపాకు ఓట్లు వేయాలని అడుగుతారా అని ఆగ్రహించారు. ఈ సమయంలో ప్రజలను ఆదుకోవాలిగానీ రాజకీయాలు వద్దని అధికార పార్టీ నాయకులకు హితవు పలికారు.
ఇలాంటి సమయంలోనూ రాజకీయాలా?: కన్నా - భాజపా ఆవిర్భావ దినోత్సవ వార్తలు
వైకాపా తీరుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన డబ్బులు తీసుకెళ్లి వైకాపాకు ఓట్లు అడుగుతారా అని ప్రశ్నించారు. ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయాలు చేయడమేంటని దుయ్యబట్టారు.
![ఇలాంటి సమయంలోనూ రాజకీయాలా?: కన్నా kanna laxminarayana on YCP over thousand rupees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6680475-234-6680475-1586149951315.jpg)
kanna laxminarayana on YCP over thousand rupees
భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కన్నా
ఇదీ చదవండి:
Last Updated : Apr 6, 2020, 2:28 PM IST