దేశ ప్రజల క్షేమం కోసం ప్రధాని మోదీ... మే 3 వరకు లాక్డౌన్ పొడిగించారని భాజపా రాష్ట్రఅధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. మోదీ ఇచ్చిన సందేశాన్ని రాష్ట్ర ప్రజలంతా పాటించాలని కన్నా కోరారు. భాజపా కార్యకర్తలంతా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయాలని సూచించారు. రాజకీయాల కన్నా ప్రజలే ముఖ్యమని మోదీ చెబుతుంటే... ముఖ్యమంత్రి జగన్ మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అంబేడ్కర్ పోరాటం మరువలేనిది : కన్నా