కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 22న(ఆదివారం) ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులకు మాత్రమే బయటకు వెళ్లాలని, జనసమూహాలు వద్దని సూచించారు. అత్యవసర సేవలు అందించే వారికి కృతజ్ఞతగా ఇంటి కిటికీలు, బాల్కనీల వద్ద నిలుచుని చప్పట్లు కొట్టాలని చెప్పారు. కరోనా మహమ్మారి నియంత్రణలో భాగస్వామ్యులు కావాలని కోరారు.
'జనతా కర్ఫ్యూ పాటిద్దాం... కరోనాను కట్టడి చేద్దాం' - జనతా కర్య్ఫూపై కన్నా కామెంట్స్
కరోనా వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు.
kanna laxminaraya