ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టును కూడా రద్దు చేస్తారేమో: కన్నా లక్ష్మీనారాయణ

కక్ష సాధింపు చర్యలు తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అహంకారపూరిత చర్యలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

kanna laxmi naryana comments on  ycp govt
kanna laxmi naryana comments on ycp govt

By

Published : Apr 10, 2020, 7:27 PM IST

Updated : Apr 10, 2020, 7:48 PM IST

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికలు వాయిదా వేశారన్న కారణంతో ఎస్​ఈసీపై వైకాపా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. ఒక బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపితే కౌన్సిల్​ను రద్దు చేశారని అన్నారు. ఇలాంటి అరాచకాలు మునుపెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించారు. అహంకారపూరిత చర్యలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే హైకోర్టును కూడా రద్దు చేస్తారేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. సీఎంగా జగన్ ప్రమాణం చేసినప్పటి నుంచి కక్షసాధింపు చర్యలు తప్ప చేసిందేమీ లేదని ఆక్షేపించారు. ఉద్యోగుల జీతాల్లో కోత వేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.

Last Updated : Apr 10, 2020, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details