ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కాళీపట్నం రామారావు మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు' - MLC Dokka Latest News

కాళీపట్నం రామారావు మరణం తెలుగు సాహిత్యానికి.. తెలుగు కథకు తీరని లోటు అని ఎమ్మెల్సీ, మహాకవి జాషువా కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన 'కారా' చిరస్మరణీయులని కొనియాడారు.

కాళీపట్నం రామారావు మరణం
కాళీపట్నం రామారావు మరణం

By

Published : Jun 4, 2021, 4:48 PM IST

ప్రముఖ కథారచయిత, కథానిలయం వ్యవస్థాపకులు డాక్టర్ కాళీపట్నం రామారావు (కారా) మృతిపట్ల ఎమ్మెల్సీ, మహాకవి జాషువా కళాపీఠం అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు. కాళీపట్నం రామారావు అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తెలుగు సాహిత్యానికి విశేషకృషి చేసిన 'కారా' చిరస్మరణీయులని కొనియాడారు. మహాకవి జాషువాకు అభిమాని అని.. జాషువా కవిత్వాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి జాషువా కళాపీఠం తరపున తాము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పాల్గొని కారా తన అభిమానాన్ని చాటుకొనే వారన్నారు. కథారచనలో ఎందరికో మార్గదర్శిగా నిలిచిన కారా మాస్టారు.. నిరాడంబరమైన జీవితాన్ని గడిపి, తన జీవితాన్నంతా కథలకు, కథానిలయానికే అంకితం చేశారన్నారు.

ABOUT THE AUTHOR

...view details