అనంతపురం జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని... మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రశ్నించిన వారిని కేసులతో వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై ఆయన జాతీయ మానవహక్కుల కమిషన్ బృందాన్ని కలిశారు. అనంతపురం జిల్లా నేమకల్లులో కాపు రామచంద్రారెడ్డికి చెందిన క్వారీని... ఎన్జీటీ ఆదేశాల మేరకు గత ప్రభుత్వం మూసివేసిందని వివరించారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక... అక్కడ మళ్లీ మైనింగ్ ప్రారంభించారని తెలిపారు. మైనింగ్ చేస్తున్న చోట భారీ పేలుళ్లపై... నేమకల్లు గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
ప్రశాంతంగా జీవించనివ్వండి... నేమకల్లు వాసుల వేడుకోలు - kapu ramachandra reddy news
మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులను కలిశారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నేమకల్లు ప్రలు ప్రశాంతంగా జీవించే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నేమకల్లు గ్రామస్థులపై బళ్లారిలో ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వేర్వేరు కేసుల్లో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. వీటన్నింటినీ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకొచ్చినా... ఆయన ఆదేశాలు క్షేత్రస్థాయిలో పోలీసులు పాటించటం లేదన్నారు. అందుకే జాతీయ మానవహక్కుల కమిషన్‌ను కలిసి... నేమకల్లు గ్రామస్థులకు న్యాయం చేయాలని కోరినట్లు వివరించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో... పోలీసులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని నేమకల్లు వాసి హనుమంతరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండీ... జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ కొట్టివేత