స్థానిక ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం, వైకాపా నేతలు ఏం సమాధానం చెప్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ప్రశ్నించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మాట్లాడిన కళా.. 151 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రినంటూ రాజ్యాంగ వ్యవస్థపైన, ఎస్ఈసీకి కులాన్ని అంటగట్టారని విమర్శించారు. సుప్రీం తీర్పుతో జగన్ ఎస్ఈసీపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధికోసం కరోనాను సీఎం తేలిగ్గా తీసుకున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో రిగ్గింగ్ పాల్పడేందుకు ఆలోచించారే తప్ప కరోనా వ్యాప్తి నివారణపై శ్రద్ధ పెట్టలేదని కళా వెంకట్రావ్ విమర్శించారు. భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా పరితపించిందని ఆరోపించారు. కరోనాపై ఆగస్టు వరకు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయన్న ఆయన... చర్యలు చేపట్టకుండా కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడటం సరికాదని హితవుపలికారు.
'సుప్రీంతీర్పుపై వైకాపా ఏం సమాధానం చెబుతుంది?' - వైసీపీపై కళా వెంకట్రావ్ కమెంట్స్
స్థానిక ఎన్నికల వాయిదాపై జోక్యం చేసుకోలేమన్న సుప్రీం తీర్పుపై వైకాపా ఏం సమాధానం చెబుతుందని తెదేపా నేత కళా వెంకట్రావ్ నిలదీశారు. సీఎం జగన్ ఎస్ఈసీపై చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా నివారణపై దృష్టి పెట్టకుండా రాజకీయ లబ్ధికోసం వైకాపా పాకులాడుతోందని విమర్శించారు.
kala venkatrao