ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వమే అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి'

ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు లేఖ రాశారు. రైతులు పంటలను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని.. ఖరీఫ్​కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లే పూర్తి కాలేదన్నారు. ప్రభుత్వమే అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్నారు.

kala-venkatrao-letter-to-cm-jagan
kala-venkatrao-letter-to-cm-jagan

By

Published : Apr 21, 2020, 1:05 PM IST

రాష్ట్రంలో అన్నదాతలు పండించిన పంటలను అమ్ముకోలేక అనేక అవస్థలు పడుతున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేర ముఖ్యమంత్రి జగన్ కు కళా వెంకట్రావ్ లేఖ రాశారు. రైతులను ఆదుకుంటామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆక్షేపించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు లాక్​డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ ఇప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. దళారులు విజృంభించి రైతుల వద్ద పంటలను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రబీ సీజన్ లో 22.44 లక్షల హెక్టార్లలో పంటలు సాగాయన్నాయన్న ఆయన... ఇప్పటికీ ఖరీఫ్ కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లే పూర్తికాలేదని విమర్శించారు. ప్రభుత్వమే అన్ని వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేయాలని కళా వెంకట్రావ్‌ డిమాండ్‌చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details