సీఎం జగన్ అమరావతిని అడవిగా మార్చారని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. గుంటూరులో మాట్లాడిన ఆయన... వైకాపా నేతల మాటలు రోజుకోమాట పూటకోబాట తరహాలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆర్థిక సంస్థల నుంచి అమరావతికి వచ్చే నిధులకు తూట్లు పొడిచారన్న కళా వెంకట్రావు... 5 కోట్ల ఆంధ్రులపై, అమరావతికి భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో నిర్మాణ వ్యయం పెరుగుతుందని తప్పుడు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. జె-ట్యాక్స్ కోసమే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో తమకు అనుకూలంగా ఉన్న వారి భూముల ధరలు పెంచుకోవటమే వైకాపా ఎజెండా అని దుయ్యబట్టారు.
'సీఎం జగన్ అమరావతిని అడవిగా మార్చారు' - అమరావతి తాజా వార్తలు
వైకాపా నేతల మాటలు రోజుకోమాట పూటకోబాట తరహాలో ఉన్నాయని... తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అమరావతిని అడవిగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి భూములిచ్చిన రైతులపై కక్ష ఎందుకని ప్రశ్నించారు.
కళా వెంకట్రావు