సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే కారణంతో అరెస్టైన తెదేపా నాయకురాలు జ్యోతిశ్రీని సీఐడీ అధికారులు జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. ఆమెను కాసేపట్లో ఆరో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి ఆమెను సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలోనే ఉంచారు.
ఆందోళనలో కుటుంబ సభ్యులు..
జ్యోతిశ్రీ అరెస్టుతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. సరైన సమాచారం ఇవ్వకుండా తన అక్కను తీసుకెళ్లటం ఏంటని ఆమె చెల్లెలు చిన్ని ప్రశ్నించారు. రాత్రి నుంచి తన సోదరి కుమారుడు అమ్మ కావాలని రోదిస్తూనే ఉన్నాడని.. ఏం జరగుతుందే అర్థం కాక రాత్రంతా గడిపామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు కనీస గౌరవం లేకుండాపోయిందని వాపోయారు. వైకాపా ప్రభుత్వం ప్రతీ చిన్న విషయాన్ని పెద్దది చేస్తోందని.. వెంటనే తన అక్కను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:సమాచారం లీక్ చేస్తున్నారని.. ఆర్థికశాఖలోని ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్