ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఎన్నికల నామినేషన్ల ఆన్​లైన్​ను ఎందుకు తప్పుబడుతున్నారు' - జనసేన నేత నాదెండ్ల మనోహర్ తాజా వార్తలు

ప్రభుత్వం ఎన్నికల నామినేషన్ల ఆన్​లైన్ ను ఎందుకు వ్యతిరేకిస్తుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు అంగీకరించబోమని స్పష్టం చేశారు.

Janasena
ఎన్నికల నామినేషన్ల ఆన్​లైన్ ను ఎందుకు తప్పుబడుతున్నారు

By

Published : Jan 29, 2021, 1:54 PM IST

సంక్షేమ పథకాలన్నీ ఆన్ లైన్ చేసిన ప్రభుత్వం.. నామినేషన్ల ఆన్​లైన్ ను ఎందుకు తప్పుబడుతోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. అధికార పార్టీ బెదిరింపులు నియంత్రించేందుకే తాము ఆన్ లైన్ ద్వారా నామినేషన్లు తీసుకోవాలని ప్రతిపాదించినట్లు స్పష్టం చేశారు. ఓటరు కార్డు, ఆధార్ కార్డు కోసం కూడా ఆన్ లైన్ లో దరఖాస్తుకు అనుమతిస్తున్న విషయం గుర్తు చేశారు. అందుబాటులో ఉన్న సాంకేతికత వినియోగించుకోవాలని సూచించారు.

పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరపున ఎక్కువగా యువతను బరిలో దింపనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై దాడులు జరుగుతున్నాయని... ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఇంకా న్యాయం చేయలేదని ఆరోపించారు. రైతులను ఆదుకోవాలనే డిమాండ్ తో శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండీ...100 గజాల్లో రూ.3 లక్షలతో ఇల్లు... తెదేపా మేనిఫెస్టో విడుదల

ABOUT THE AUTHOR

...view details