ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలం'

By

Published : Dec 26, 2020, 7:05 PM IST

దేశానికి అన్నం పెట్టే రైతున్నను వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

janasena leader press meet at guntur
రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం ఘోర విఫలం

నివర్ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో... వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. తక్షణ పరిహారం కింద రూ. 10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించ లేదన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతున్నను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

నవరత్నాల హామీలను అమలు చేయడానికి డబ్బులు ఉంటాయి కానీ.. రైతులకు పరిహారం చెల్లించడానికి ఉండవా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల సమస్యల గురించి ఈ నెల 28న కలెక్టర్​ను కలసి వినతి పత్రం అందచేస్తామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి.. రైతులకు న్యాయం చేస్తే శాంతంగా ఉంటామని.. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

గత ప్రభుత్వం కట్టిన ఇళ్లనే లబ్ధిదారులకు ఇవ్వని ప్రభుత్వం.. అట్టహాసంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని.. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయన్నారు. స్వయానా ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఏవిధంగా ప్రవర్తించారో నిన్న రాష్ట్ర ప్రజలు అందరూ చూశారన్నారు. ప్రశ్నించిన వారిపైన క్రిమినల్ కేసులు పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యపట్టారు.

ఇదీ చూడండి:

'వ్యవసాయ చట్టాలపై ప్రధాని అబద్ధాలు చెబుతున్నారు'

ABOUT THE AUTHOR

...view details