IT raids on sakku group Guntur : గుంటూరులోని సక్కు గ్రూప్ కంపెనీలపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. స్పిన్నింగ్, హేచరీస్ వ్యాపారాల నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఇన్కం ట్యాక్స్ విభాగం ఆధ్వర్యంలో నిన్న ఉదయం నుంచి రాత్రి 9గంటల వరకు వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు చేశారు. వార్షిక రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలతో పాటు పలు రికార్డులను ఐటీ అధికారులు పరిశీలించారు.
IT raids on sakku group : సక్కు గ్రూప్ కంపెనీలపై అధికారుల దాడులు...రికార్డుల పరిశీలన - crime news in guntur
IT raids on sakku group Guntur : గుంటూరులోని సక్కు గ్రూప్ కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. గ్రూప్ వ్యాపార సంస్థలు, ఇళ్లలో సోదాలు చేసి, పలు రికార్డులను పరిశీలించారు.
సక్కు గ్రూప్ కంపెనీలపై అధికారుల దాడులు